Tuesday, April 12, 2011

Lalitha Saharanama meaning in telugu లలితా సహస్రనామ ప్రతిపదార్థము

లలితా సహస్రనామ ప్రతిపదార్థము
శ్రీ మాత్రేనమః 

శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం 
పూర్వభాగః 
ప్రథమోధ్యాయః 

శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీమ్
 నమామి లలితాం నిత్యం మహాత్రిపుర సున్దరీమ్ 
శ్రీవిద్య అనబడే బాల, పంచదశీ షోడశీ మంత్రరూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నిటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యాలను నిర్వర్తించేది, నిత్యా అనే కలాస్వరూపిణిగా విలసిల్లుతున్నది, త్రిపురసుందరీ స్వరూపిణి ఐన శ్రీ లలితదేవికి(నేను) నమస్కరిస్తున్నాను  

అగస్త్య  ఉవాచ:
అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర  విశారద 
కథితం లలితాదేవ్యా శ్చరితం  పరమాద్భుతమ్ 
సకలశాస్త్ర పారంగతుడివి, బుద్ధిశాలివి ఐన ఓ హయగ్రీవ స్వామీ!
ఎంతో అద్భుతమైన శ్రీ లలితాదేవి చరిత్రను చెప్పారు.
పూర్వం ప్రాదుర్భవో మాతు స్తతః పట్టాభి షేచనం
భండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదితః 
ముందు శ్రీదేవి జన్మిచటం గురించి చెప్పారు. తరువాత ఆమెకు త్రైలోక్య పట్టాభిషేకం చేసింది, 
భండాసుర సంహారాన్ని కూడా సవిస్తరంగా తెలిపారు.
వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం
శ్రీమత్పంచ దశాక్షర్యాః మహిమా వర్ణిత స్థథా.
మహావైభవోపేతంగా విస్తరించిన శ్రీపురాన్ని గురించి వర్ణించ బడింది.
అలాగే శ్రీ పంచాదశాక్షరీ మంత్రమహిమ కూడా వర్ణితమయింది. 
షోడాన్యాసాదయో న్యాసాః న్యాస ఖండే సమీరితాః
అంతర్యాగా క్రమశ్చైవ బహిర్యాగా క్రమ స్తథా.
న్యాస ఖండంలో శోడాన్యాసాదులు చెప్పబడ్డాయి.
 అంతర్యాగక్రమం భహిర్యాగక్రమమూ  అలాగే చెప్పబడ్డాయి. 
మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరితః 
పురశ్చరణ ఖండేతు జపలక్షణ మీరితమ్.
పూజాఖండంలో మహాయాగ క్రమాన్ని గురుంచి సెలవిచ్చారు. 
పురశ్చరణ ఖండంలో జప లక్షణాన్ని గురించి చెప్పారు.
హోమఖండే త్వయాప్రోక్తో హోమద్రవ్య విధిక్రమః
హోమఖండంలో హ్మద్రవ్య భేదాలను గురించి, చేసే విధానాల గురించి మీచే చెప్పబడింది.
చక్రరాజస్య విద్యాయాః శ్రీదేవ్యా దేశికా న్మనో:
రహస్యఖండే తాదాత్మ్యం పరస్పర ముదీరితమ్
స్తోత్ర ఖండే బహువిధా స్త్సుతయః పరికీర్తితాః
రహస్య ఖండంలో శ్రీచక్రం యొక్క, శ్రీవిద్య యొక్క, గురుశిష్యుల యొక్క పరస్పర సంబంధం చక్కగా తెలుప బడినది. ఇందులో పలు విధాలైన స్తోత్రాలు చెప్పబడినవి. 

No comments:

Post a Comment